calender_icon.png 31 October, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు

31-10-2025 02:10:22 AM

  1. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ముగింపు ఉత్సవాలు
  2.   2025 డిసెంబర్ 26న ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ 
  3. హాజరుకానున్న 40 దేశాల ప్రతినిధులు 
  4. విరివిగా విరాళాలు ఇవ్వండి వేడుకల్లో పాల్గొనండి
  5. ముత్యాల విశ్వనాథం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

భద్రాద్రికొత్తగూడెం, అక్టోబర్ 30, (విజయక్రాంతి): భారతదేశం గడ్డపై సిపిఐ పార్టీకి 100 ఏళ్ళు పూర్తి అయ్యాయని, శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ము త్యాల విశ్వనాథం పిలుపునిచ్చారు.పాల్వంచ మండలం పాండురంగాపురంలో గురువా రం ఆయన ఇంటికి వెళ్లి సిపిఐ కరపత్రాలు పంచుతూ విరాళాలు సేకరించారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూని స్టు పార్టీ భారత గడ్డపై సిపిఐ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని తొలత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. దేశవ్యాప్తంగా ఉత్సవా లు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి బ్రి టిష్ వారి నుండి మన దేశ విముక్తి కొరకు రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించారు.

కాన్పూర్ మిరట్ పెషవర్ తదితర కుట్ర కేసులను పెట్టి జైల్లో నిర్బంధించారు వెట్టి చాకిరి విముక్తి కొ రకు కార్మిక విద్యార్థి రైతు యువజన మహి ళా.తదితర ప్రజాసంఘాల నిర్మించి ఆనాటి నుండి నేటి వరకు అనేక ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల మన్ననలు పొందిన ఏకైక పార్టీ సిపిఐ అన్నారు.

పాల్వంచ మండలంలో ప్రజలంతా ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో వేలాదిగా.పాల్గొని జయప్రదం చే యాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి వీసం శెట్టి పూ ర్ణచంద్రరావు, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు మన్నెం వెంకన్న ,పెద్ద వెంకటరామయ్య ,కోటి తిరుపతయ్య, వెంకటరత్నం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.