31-10-2025 02:05:10 AM
 
							భద్రాచలం, అక్టోబర్ 30, (విజయక్రాంతి): భద్రాచలం పట్టణం మీదగా పట్టణాలకు అక్రమం గా తరలిస్తున్న రూ 12.50 లక్షల విలువగల గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఉదయం భద్రాచలం ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న 25 కేజీల గంజాయి కనిపించింది. దీంతో అప్రమత్తమైన ఎక్సైజ్ సిబ్బంది కారును అందులో ఉన్న 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కారు నడుపుతున్న మొహమ్మద్ హుస్సేన్ పై కేసు నమోదు చేశారు.
గంజాయి అక్రమ ర వాణాకు ఉపయోగించిన కారును, సెల్ ఫోన్స్ సైతం స్వాధీనం చేసుకొని కేసును రిజిస్టర్ చేసి కోర్టుకు పంపుతున్నట్లు ఎక్సైజ్ అధికారి మున్నిసా బేగం తెలిపారు. గంజాయి పట్టుకున్న వారిలో ఎక్సైజ్ సిబ్బంది కే బాబు, వి వీరబాబు, మనోహర్ లలిత నేలవేణి కిరణ్ తదితరులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్య ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.