31-10-2025 02:06:53 AM
 
							కేటీపీఎస్ లో ఉద్యోగుల తీరు పట్టించుకోని అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 30, (విజయక్రాంతి): ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో వేతనాలు, ఇతర సౌకర్యాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6 దశల్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి విధి నిర్వహణ కన్నా, ఫోన్లో చాటింగే మిన్న అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.
కొంతమంది ఏడిఈ, డి ఈ స్థాయి ఉద్యోగులు, మహిళా ఉద్యోగితో గంట తరబడి ఫోన్లో చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో ఆర్టిజన్లు, కిందిస్థాయి ఉద్యోగులు సైతం ఎక్కువ సమయం ఫోన్లతో గడుపుతున్నట్టు తెలుస్తోం ది.ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన, ఆ మహిళా ఉద్యోగి స్థానచలనం కల్పించిన ఆమెలో తీరు మారలేదని తెలుస్తోంది.
జన్కో డైరెక్టర్ లు, సిఎండి కల్పించుకొని కేటీపీఎస్ 5, 6 దశల్లో ఉద్యోగుల విధి నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.