31-10-2025 12:52:29 AM
 
							హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం లభించడం లేదని సెప్టెంబర్ 29న ‘విజయక్రాంతి’ మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా స్థానం లభించలేదని నొక్కి చెప్పింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానవర్గం స్పందించింది. మొహమ్మద్ అజారుద్దీన్‌కు రాష్ట్ర క్యాబినెట్‌లో స్థానం కల్పించాలని నిర్ణయించింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడమే శ్రేయస్కరం అని కాంగ్రెస్ భావించింది. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి జూబ్లీహిల్స్ బరినుంచి పీసీసీ ఆయనను తప్పించినా, కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం తమ చాయిస్‌గా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఒకరక మైన ఒత్తిడితో ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో ఒత్తిళ్లు ఉంటాయా.. సజావుగా సమీకరణలకు ఆస్కారం ఉంటుందా అనేది వేచిచూడాల్సిందే.