calender_icon.png 31 October, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ఓపెన్ హౌస్

31-10-2025 02:08:33 AM

కొత్తగూడెం, అక్టోబర్ 30, (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. అందుబాటులో ఉన్న స్కూల్ విద్యార్థులు స్వయంగా ఓపెన్ హౌస్ ను సందర్శించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు.

ఈ ఓపెన్ హౌస్ ద్వారా విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరు,విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా డాగ్ స్క్వాడ్ (పోలీసు జాగిలాలు), అల్లర్ల నియంత్రణకు వినియోగించే స్మోక్ గన్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం యొక్క పని విధానాన్ని వివరించారు.అలాగే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు,షీ టీం, సైబర్ క్రైమ్ పోలీసుల పనితీరు,భరోసా సెంటర్ ప్రాముఖ్యత,ఫింగర్ ప్రింట్స్,క్లూస్ టీం వంటి వాటిని గురించి విద్యార్థులకు పూర్తి వివరాలు అందించారు.

సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, నేరం జరిగినట్లయితే వెంటనే ఫిర్యాదు చేసే విధానాలను వివరించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ రెహమాన్ తెలిపారు. పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మనందరి భాద్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం 3టౌన్ సీఐ శివప్రసాద్,1టౌన్ సీఐ కరు ణాకర్, అడ్మిన్ ఆర్‌ఐ లాల్ బాబు, భరోసా సెంటర్ ఎస్త్స్ర అరుణ, షీ టీం ఆర్‌ఎస్త్స్ర రమాదేవి, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీం అధికారులు, డాగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.