17-10-2025 06:41:17 PM
సిపిఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు
చిలుకూరు: శనివారం జరిగే బీసీ బందుకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని దొడ్డ నర్సయ్య భవన్ సిపిఐ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దురహంకార బిజెపి బిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రలు చేస్తుందని దానిని వ్యతిరేకిస్తూ బిసి సంఘాలు ఇచ్చిన బిసి బందుకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబిసి రిజర్వేషన్లపై వేసిన మండల్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలనే నిర్ణయాన్ని బిజెపి గట్టిగా వ్యతిరేకించిందని బిసి గుర్తింపును తిరస్కరించడం, కుల ఆధారిత రిజర్వేషన్లను వ్యతిరేకించడం సంఘ్ పరివార్ ఆదేశాలను బిజెపి తూ. చా తప్పకుండా పాటిస్తుందని. అందుకే తెలంగాణలో బిసి రిజర్వేషన్లపై బిజెపి ద్వంద వైఖరి ప్రదర్శిస్తుందని. ఆర్ ఎస్ ఎస్ బిజెపిల చరిత్ర ఎల్లప్పుడూ అణగారిన వర్గాల ,దళితులు మరియు వెనుకబడిన ప్రజలకు వ్యతిరేకంగా ఉందని. అందుకే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకిస్తుందని బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్సు ను గవర్నర్ ఆమోదించకపోవడం బిజెపి కుట్రలో భాగమేనని. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవో తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కోర్టులు స్టే విధించడం విచారకరమని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి. రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని బీసీలకు న్యాయం జరగాలని బీసీ జేఏసీ నిర్వహించే రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని. సిపిఐ శ్రేణులు బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.