calender_icon.png 17 October, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు

17-10-2025 07:10:13 PM

దౌల్తాబాద్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో శనివారం మండలంలో సంపూర్ణ బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌కు మద్దతు తెలుపాలని ఆయన కోరారు. ఊరూవాడా కదలి బీసీ హక్కుల కోసం బలమైన సంకేతాన్ని ఇవ్వాలన్నారు.

బంద్ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని, అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వాలని రాములు సూచించారు. బంద్ విజయవంతం చేసేందుకు సమాజంలోని అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు,ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి, మాజీ సర్పంచ్ రైతన్న, ఆత్మ కమిటీ డైరెక్టర్ బొల్లం యాదగిరి, నాయకులు మైసిగారి శ్రీను, నర్సింలు, అంజగౌడ్, రాజు, యేసు, ఎల్లయ్య, హమ్జద్, శ్రీనివాస్, రమేష్, రాంబాబు తదితరులున్నారు.