17-10-2025 06:34:48 PM
కుభీర్,(విజయాక్రాంతి): జిల్లా కేంద్రంలోని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ నిర్మల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల కరాటే ట్రైనింగ్ & బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో కుభీర్ మండలంలోని చాణక్య సంస్కృతి పాఠశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. వివిధ జిల్లాల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో, కుభీర్ విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. జపాన్ కరాటే శోటోకన్ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలను అసోసియేషన్ ఇండియా చీఫ్ పరీక్షకులు సెన్సాయీ రాపోలు సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా పరీక్షకులు సెన్సాయీ తేజసింగ్ భాటియా పర్యవేక్షించారు.
ఈ పరీక్షల్లో చాణక్య సంస్కృతి పాఠశాల విద్యార్థులైన పి.ఆధ్య (1వ త.), టి.శ్రీనిధి (4వ), డి.రాణవిత (4వ), జె.ఆరుష్ (4వ), టి.మధుప్రియ (5వ), పి.ఆకర్ష్ (5వ), టి.హరీష్ సింగ్ (6వ), యస్.సవిధన్ (6వ), పి.మనిదిప్ (7వ), జి.నీక్షిత్ (7వ), పి.సహస్ర (యూకెజి) వంటి 11 మంది విద్యార్థులు జూనియర్ రెడ్ & ఎల్లో బెల్ట్‌లు సాధించారు. పిల్లల విజయంతో పాఠశాల డైరెక్టర్ పి.సతీష్, జె.శ్రావణ్, ప్రిన్సిపల్ పి.నరేష్, కరాటే కోచ్ ప్రతీక్ష హర్షం వ్యక్తం చేస్తూ, “మా విద్యార్థులు కరాటేలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత భవిష్యత్తులో జాతీయ స్థాయి విజయాలకు మార్గం చూపుతాయి” అని పేర్కొన్నారు. కుభీర్ విద్యార్థులు కరాటే రంగంలో ప్రతిభతో మెరిసి గ్రామానికి గర్వకారణమయ్యారు!