17-10-2025 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి
మహబూబాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ నెల 18 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘా లు, రాజకీయ పార్టీలు బందు చేస్తున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు మహబూబాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి బి.విజయసారథి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి షెడ్యూల్ 9 లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు మాట్లాడకుండా బీసీలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ప్రధాని వద్ద ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బిజెపి దాటవేత ధోరణి అవలంబి స్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకుంటే ఆందోళనలు తప్పమన్నారు. అక్టోబర్ 18న బీసీ సంఘాలు చేస్తున్న బందుకు మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో సిపిఐ పార్టీ శ్రేణులు బందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.