01-12-2024 02:40:29 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30(విజయక్రాంతి)/ కాప్రా: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ గుండెపోటుతో శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య వందన, కుమారుడు నిషాంత్, కుమార్తె నిఖిత ఉన్నారు. మల్కాజిగిరి జిల్లా యాప్రాల్‌లో నేడు అంత్యక్రియలు జరుగనున్నట్లు సీపీఐ పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యాప్రాల్ గ్రామంలో 1966 జూన్ 15న బాలమల్లేశ్ జన్మించారు.
ముగ్ధూం భవన్‌లో భౌతికకాయం..
బాలమల్లేశ్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లోని శ్మశానవాటికలో జరుగుతాయని పార్టీ శ్రేణులు, కుటుంబసభ్యులు తెలిపారు. సందర్శనార్ధం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హిమాయత్‌నగర్‌లోని ముగ్ధూం భవన్‌లో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు.