10-02-2025 01:19:37 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): వేసవికి ముందే రాష్ట్రం లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు ఛాయలు అలుముకున్నాయని విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆదివారం కేటీఆర్ స్పంది స్తూ రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి, పాలమూరు ఎత్తిపోతలను పడావుపెట్టిన ఫలితమే ఇందుకు కారణమని ఆరోపిం చారు.
‘నాడు బీఆర్‌ఎస్ పాలనలో ఎండాకాలంలో దుంకిన మత్తడు లు.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న వరి మడు లు.. నాడు ఉప్పొంగిన గంగమ్మ.. నే డు అడుగంటుతున్న భూగర్భజలాలు.. ఈ పరిస్థితి రాష్ట్రంలో కరువు ఛాయలకు నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశారు.