28-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా బౌ రంపేట పరిధిలోని ది క్రీక్ ప్లానెట్ స్కూల్ మెర్క్యురీ క్యాంపస్ పాఠశాల వార్షికోత్సవం ‘సంగం 2025’ వైభవంగా జరిగింది. ము ఖ్య అతిథిగా జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్‌ఎండీఏ సెక్రటరీ శ్రీవత్స కోట హాజరయ్యారు. పాఠశాల చైర్మన్ బొల్లి నేని సీనయ్య, వైస్ చైర్మన్ పాండురంగ చారి, ఫౌండర్ అండ్ డైరెక్టర్ నరేంద్ర ప్రసాద్, ప్రతిమా సిన్హా , హెడ్ అకడమిక్ డా జయశ్రీ నాయర్, సి.ఓ.ఓ డా. జీవని గద్దె మరియు ఇతర శాఖల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.
భారతీయ జ్ఞాన పరంపర నేపథ్యంగా సాగిన ఈ వార్షికోత్సవాన్ని ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్నారులు భారతీయ సాంస్కృతిక వారసత్వం, వేదాలు, పురాణాలు, ధర్మం, జానపద కళలు వంటి అంశాలతో కూడిన విభిన్న నృత్య కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ‘భువన విజయం’ నాటకం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది.శ్రీవత్స కోట తన ప్రసంగంలో ఈ వార్షికోత్సవాన్ని అర్థవంతంగా, సాంస్కృతిక విలువలతో నిండుగా నిర్వహించిన పాఠశాలను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీమతి హిమ జ్యోత్స్న పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. ప్రతి మా సిన్హా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో కీలకమని పేర్కొన్నారు. డా. జయశ్రీ నాయర్ కూడా విద్యార్థులు మరియు సిబ్బంది చేసిన కృషిని హృదయపూర్వకంగా అభినందించారు.