calender_icon.png 3 October, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గట్లమల్యాలలో క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసం

03-10-2025 06:29:30 PM

నంగునూరు: మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామంలో దసరా పండుగ సందర్భంగా రంగు పరశురాములు జ్ఞాపకార్థం ఆయన మనుమండ్లు క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు.హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్‌లో బుల్స్ టీం అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి 10000 ప్రైజ్ మనీని గెలుచుకుంది.రన్నరప్‌గా ముదిరాజ్ కింగ్స్ జట్టు నిలిచి 5000 నగదు బహుమతిని సొంతం చేసుకుంది. ఈ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను రంగు పరశురాములు గౌడ్ మనుమండ్లు అయిన రంగు మనోజ్, శ్రేయస్, చింటూ, ప్రమోద్, వినయ్, అనుదీప్ గౌడ్లు తదితరులు కలిసి నిర్వహించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని,యువకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం గ్రామంలో క్రీడా ఉత్సాహాన్ని నింపి, పండుగ వాతావరణాన్ని మరింత పెంచింది. తమ తాత జ్ఞాపకార్థం యువతను ప్రోత్సహిస్తూ టోర్నమెంట్ నిర్వహించిన మనుమండ్లను గ్రామస్తులు అభినందించారు.