03-10-2025 06:32:36 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం లో శుక్రవారం కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో పార్టీ అధ్యక్షుడు ధరాస్ వార్ సాయిలు మాట్లాడుతూ... రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, “ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలి” అన్నారు. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.