24-09-2025 10:58:31 PM
ఆడి పాడిన మెడికోలు, ఫ్యాకల్టీ
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీలక్ష్మి అధ్వర్యంలో మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆట పాటలతో సంబరాలను జరుపుకున్నారు.