calender_icon.png 17 November, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడియారం చెరువులో మొసళ్ల కలకలం

17-11-2025 12:00:00 AM

భయాందోళనలో గ్రామస్తులు

చేగుంట, నవంబర్ 16 :చేగుంట మండల పరిదిలోని వడియారం చెరువులో మొసళ్లు సంచారిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో, వరదనీటితో పాటు రెండు మొస ళ్లు చెరువులోకి వచ్చి చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతిరోజూ చెరువు మీదుగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు భయాందోళన చెందుతున్నారు. ఉదయం, సాయంత్రం పొలాలకు వెళ్లేటప్పుడు ఆ రెండు మొసళ్లు కన్పిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి మొనళ్లను వెంటనే పట్టుకోవాలని గ్రామసులు కోరుతున్నారు.