02-08-2025 04:52:01 PM
పోస్టర్ విడుదల చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్..
కొత్తపల్లి (విజయక్రాంతి): మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి(Convener Mutyala Jagan Reddy) ఆధ్వర్యంలో గన్నేరువరం మండలంలోని ప్రతీ గ్రామంలో ఇంటింటికి రాఖీ అందించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) చేతుల మీదుగా కరీంనగర్ లో శనివారం పోస్టర్ విడుదల చేశారు. అన్నాచెల్లెళ్ళ అనుబందానికి ప్రతీకగా నిలుస్తున్న రాఖీ పండగ ప్రాముఖ్యతను పెంచడమే లక్ష్యంగా రాఖీలతో పాటు మహాశక్తి దేవాలయంలో అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన పసుపు, కుంకుమ పంపిణీ చేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు జగన్ రెడ్డి తెలిపారు.
మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేవిధంగా, సమాజంలో అనుబందాలను మర్చిపోతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని మంత్రి కొనియాడారు. అనుబందాలను గుర్తుచేసుకునే విదంగా ఈ రాఖీ పంపిణీ కార్యక్రమాన్ని గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నట్లు జగన్ రెడ్డి తెలిపారు.కలకాలం నిలిచిబోయే అనుబందాన్ని మర్చిపోలేని రాఖీ పండగ రోజు రాఖీ లను మండల ప్రజలందరికీ అందించే కార్యక్రమాన్ని చేపట్టిన ముత్యాల జగన్ రెడ్డి ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రఘు, సొల్లు అజయ్ వర్మ, వరాల జ్యోతి,బండారు గాయత్రి, మాసం గణేష్, తాడూరి కిరణ్ రెడ్డి, బామండ్ల రాజు, మునిగంటి సత్తయ్య మరియు పుల్లెల రాము పాల్గొన్నారు.