02-08-2025 04:49:18 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక అల్గునూర్ పారమిత వరల్డ్ స్కూల్(Paramita World School)లో హౌస్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పారమిత పాఠశాలల చైర్మన్ డా. ఈ.ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పాఠశాల విద్యార్థులు గృహాల వారిగా పతాక ఆవిష్కరణ, క్రీడా ప్రమాణ స్వీకారం, అద్భుతమైన మార్చ్ పాస్ట్‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం హౌస్ ప్రారంభ వేడుకలలలో భాగంగా విద్యార్థులను ధ్యానచంద్, ఆర్యభట్ట, సి.వి.రామన్, చాణక్య గృహాలుగా విభజించి, ఈ గృహ ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా చైర్మన్ ఈ.ప్రసాదరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. ఈ.ప్రసాదరావు మాట్లాడుతూ, "హౌస్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సమూహచేతన, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందనీ, విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఇది బాగా దోహదపడుతుందని పారమిత పాఠశాలల్లో గత 30 ఏళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం" అని పేర్కొన్నారు. హెడ్ బాయ్ ,హెడ్ గర్ల్ మరియు ప్రతీ గృహానికి క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్, అసెంబ్లీ ,సిసిఏ,స్పోర్ట్స్ క్యాప్టెన్ లను ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారనీ, ఈ గృహాలలోని విద్యార్థులు బృందాలు గా ఏర్పడి సాంసృతిక అంశాలు,క్రీడా అంశాలలో పోటీ పడడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, ప్రిన్సిపాల్ ఎం.శ్రీకర్ హౌస్ కన్వీనర్ కె.శ్రీనివాస్, పిఈటీ లు జెట్టి శ్రీనివాస్, టి.శ్రీధర్, అశోక్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.