02-08-2025 04:46:18 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): అటవీ శాఖ అధికారులు రైతులను వేధించడం మానుకోవాలని సిపిఐ ఎం నాయకులు దుర్గం నూతన్ కుమార్(CPI(M) leaders Durgam Nutan Kumar) హెచ్చరించారు. ఈ మేరకు ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలో బోసు భూమన్న అనే రైతు గత 40 సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్న ఐదు ఎకరాల భూమిని అటవీశాఖ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకుని రైతును వేధించడం అన్యాయమని, ఒక రైతునే టార్గెట్ చేసుకొని ఆ భూమిలో మొక్కలు నాటించి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేయడం సరికాదని వెంటనే అటవీ అధికారులు కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. శనివారం స్థానిక అటవీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగెల్లి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.