02-08-2025 04:38:10 PM
మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావ్..
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ పోలీస్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కమాండ్ కంట్రోల్ కెమరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు(District SP Srinivasa Rao), అడిషనల్ ఎస్పీ మహేందర్(Additional SP Mahender) పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఒక్కొక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాల ప్రాధాన్యత గూర్చి ఎస్పీ వివరించారు. తూప్రాన్ పట్టణంలో సీసీ కెమెరాల అమరికలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఇంత చక్కగా సీసీ కెమరాలను తీర్చిదిద్దిన తూప్రాన్ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్ లను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. ముఖ్యంగా ఈమధ్య కాలంలో చాలా మట్టుకు క్రైమ్ పెరిగిపోవడం జరిగింది.
దీనికీ అనుకూలంగా సీసీ లు ఉపయోగపడతాయని అద్దరాత్రుల్లో అపరిచిత వ్యక్తులు ఏ ప్రాంతములో తిరిగిన సీసీలో రికార్డు అవుతాయని దీని బట్టి చొరికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం సులువుగా ఉంటుదని ఎస్పీ తెలిపారు. ఇందులో అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివానందం, ఎస్ఐ సుభాష్ గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.