25-09-2025 12:50:29 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి సెప్టెంబర్ 24 : నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమనగల్ పురపాలికల అభి వృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు . బుధవా రం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలి సి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా మున్సిపాలి టీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగు తుందన్నారు.
అంతర్గత రహదారులు, జంక్ష న్ లో, ఆడిటోరియం వంటివి నిర్మించేందు కు ఒక్కొక్క పురపాలకకు రూ,15 కోట్ల చొ ప్పున మంజూరయ్యాయన్నారు. కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాను. జంక్ష న్ గా ఏర్పాటు చేసి అక్కడి నుండి శివాజీ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ చేపట్టినట్లు తె లిపారు. ఎన్నో ఏండ్లుగా వాహనదారులకు దారిపై మురుగునీళ్లు పారుతూ ఇబ్బందిగా మారిన ఎల్లికల్ మార్గంలో బ్రిడ్జి నిర్మాణాని కి నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
శివాజీ కూడలిలో రూ .2కోట్లతో దుకాణ సముదాయా న్ని నిర్మిస్తున్నామన్నారు. మరో రూ,2 కో ట్లతో ఆడిటోరియం బిల్డింగ్ నిర్మిస్తున్నట్లు తె లిపారు. కల్వకుర్తి పురపాలికలో ఇప్పటివరకు 80 కోట్ల నిధులాచ్చాయని మును ముందు మరిన్ని నిధులు తెచ్చి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత వాసి అయిన ముఖ్యమంత్రి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. పట్టణంలో రూ ,40 కోట్లతో ఏటీసీ సెంటర్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని త్వరలోనే ప్రారంభించుకుంటామన్నారు.
విద్య వైద్యం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. విద్యా కమిషన్ కమిటీ సభ్యుడు వెంకటేష్ మాట్లాడుతూ... గత ప్ర భుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుతున్న కాలానుగుణంగా విద్యను అందించా లని ఉద్దేశంతో పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో టీ షార్ట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, నాయకులు భూపతిరెడ్డి, రాములు, చంద్రకాంత్ రెడ్డి, మక్బుల్, ఎజాజ్ తదితరులుపాల్గొన్నారు.