25-09-2025 12:50:32 AM
ఎమ్మెల్యే జారె
ములకలపల్లి, చంద్రుగొండ, సెప్టెంబర్ 24,(విజయక్రాంతి):అశ్వారావుపేట నియోజకవర్గం లోని చండ్రుగొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ సాజీద్ హుసేన్ (సజ్జు) మంగళవారం రాత్రి కొత్తగూడెం వెళ్తూ మార్గమధ్యలో రుద్రంపూర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అకాల మరణం చెందాడు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సాజీద్ హుస్సేన్ పార్ధివదేహాన్ని బుధవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సందర్శించారు.
వైద్యుల ద్వారా శవ పంచనామా పనులు దగ్గరుండి పూర్తి చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ నాయకుడి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సూచించారు.