calender_icon.png 14 August, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

11-08-2025 12:29:20 AM

 చేర్యాల, ఆగస్ట్  10: ప్రముఖ పుణ్యక్షేత్ర మైన కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు వారాల కంటే ఈ వారం భక్తుల రాక కొంచెంతగ్గినప్పటికీ, భక్తుల కోలాహలం  కొనసాగింది. శ్రావణమాసంలో ఇది మూడో వారం కావడంతో భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు గంటకు పైన సమయం పట్టింది. ముందుగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి కోనేట్లో పుణ్యస్నానమాచరించి, స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

అనంతరం కొంతమంది భక్తులు స్వామివారికి అభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవల్లో పాల్గొని పూజలు చేశారు. మరికొంతమంది భక్తులు ముఖ మండపం, గంగిరేణి చెట్టు కింద బోనాలు చెల్లించి, పట్నాలు వేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా కొండపై నెలకొన్న ఎల్లమ్మ తల్లికి  బోనాలు సమర్పించి, తల్లిని భక్తితో వేడుకున్నారు. శ్రావణమాసంలో వచ్చే వారం చివరిది అయినందున భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉంటాయని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలయ క్షేత్రంలో ఆదివారం ఉదయం నుంచి సందడి మొదలైంది. భక్తుల రద్దీకి తగ్గట్లు ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పాటలను ఈవో అన్నపూర్ణ పర్యవేక్షించారు.