calender_icon.png 14 August, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్ల గడువు పెంపు

11-08-2025 12:29:17 AM

బెల్లంపల్లి, ఆగస్టు 10 : తెలంగాణ రాష్ర్ట సాంకేతిక విద్యాశాఖ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కోర్సుల స్పాట్ అడ్మిషన్ల గడువును పెంచినట్లు బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మారం దేవేందర్  తెలిపారు.

సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అవసరమైన ఫీజు తో పాటు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు