11-08-2025 12:29:49 AM
కామారెడ్డి, ఆగస్ట్ 10 (విజయక్రాంతి): రైతు పండించే పంట ఆరు కాలం కష్టపడి సాగు చేస్తే చేతికి వచ్చేవరకు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో అన్నదాతలు ఆందోళన చెందు తున్నారు. ఒకవైపు ప్రకృతి మరోవైపు మరో వైపు అటవీజంతువులు రైతుల పంటలను నష్టం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రాజం పేట మండలం బసవన్నపల్లి గ్రామంలో ఏనుగు రాజిరెడ్డి తనకు ఉన్న రెండేకరాల మెట్ట భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు.
మొక్కజొన్న పంట కంకులు అవుతున్న సమయంలో ఎలుగుబంటులు వచ్చి మొక్కజొన్న పంటను ధ్వంసం చేశా యి. మొక్కజొన్న పంటను కాపాడుకునేం దుకు ఒకవైపు రైతు ప్రయత్ని స్తుండగా మరోవైపు ఎలుగుబంటులు వచ్చి పంటను నాశనం చేశాయి. దీంతో రైతు ఏనుగు రాజు రెడ్డి తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలి యక ఆందోళన చెందుతున్నారు.
మొక్క జొన్న కంకులుగా ఏర్పడే సమయంలో ఎలుగుబంట్లు వచ్చి పంటను ధ్వంసం చేసి వెళ్ళాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు, ప్రభుత్వాన్ని కోరుతు న్నారు. తనకు పంట నష్టపరిహారం ఇప్పిం చాలని వాపోతున్నారు.