calender_icon.png 5 July, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుతడి పంటలపై మక్కువ పెంచండి

03-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్‌నగర్, జూలై 2 (విజయ క్రాంతి) : రైతులు ఆరుతడి పంటల పై మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏ.డి.లు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ ఆహార భద్రత పథకం సహకారంతో అంధించిన కంది పంట విత్తనాల మినికిట్స్ ను రైతులకు జిల్లా కలెక్టర్ ఉచితంగా పంపిణీ చేశారు.

సందర్భంగా కలెక్టర్ అప్పు దినుసుల పంటలు సాగు చేయడం వల్ల రైతులకు అత్యధిక లాభాలు చేకూరి అవకాశం ఉంటుందని తెలిపారు.  అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అదికారి బి.వెంకటేష్ మాట్లాడుతూ పప్పు దినుసుల పంటలు అధికంగా సాగుచేయాలని, విస్తీర్ణం పెంచుట వలన గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. ప్రతి రైతు మార్కెట్లో పంటలు విక్రయించి అధిక లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమoలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు,  ఏఈఓ లు, పాల్గొన్నారు.