22-04-2025 08:45:57 PM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ స్వప్న- సదానందం...
హుజరాబాద్ (విజయక్రాంతి): మెగా ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి 2025 సంస్కృతిగా పోటీలను విజయవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న- సదానందం కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ని రిథమ్ డాన్స్ అకాడమీ, తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 26, 27 తేదీలలో జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో సాంస్కృతిక, క్లాసికల్, వెస్ట్రన్, జానపదం, మిమిక్రీ, పాటల పోటీలను ఈ ప్రాంత కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబాల రాజు, గ్రాండ్ మాస్టర్ సంతోష్, ఆర్గనైజర్ చంటి తో పాటు తదితరులు పాల్గొన్నారు.