04-05-2025 05:15:10 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పదవ వార్డు వీరారం తండాలో స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 4.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను సంస్థ బాధ్యులు కటికనేని నిహాల్ కృష్ణ, నిహాల్ కుమార్, నైమిశా, సునయన, రాహుల్, విశ్వనాధ్ ప్రారంభించారు. తండావాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే 40 గృహాలకు కవితమ్మ హరితమ్మ టీం సభ్యులు వాటర్ క్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బానోతు రాము, హత్తి రామ్ నాయక్, శంకర్ నాయక్, లచ్చిరాం నాయక్ దేవుల, గణేష్, రాజేష్, లక్ష్మణ్, సంపత్, అంజి, ప్రశాంత్, అజయ్ కుమార్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.