calender_icon.png 10 September, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వయిరీ వేయడం సిగ్గుచేటు

04-09-2025 12:18:54 AM

 నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల, సెప్టెంబర్ 03 : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపిన కేసీఆర్ పై కుట్రలను యావత్ రాష్ట్రం జీర్ణించుకోలేక పోతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసిఆర్‌పై సిబిఐ ఎంక్వైరీ వేయ డం సిగ్గు చేటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలను ఖండిస్తూ బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని అంబేద్కర్  విగ్రహానికి ఆయన వినతి పత్రం అందజేశారు.  అనంతరం సుభాష్ సెంటర్లో  సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి వారిని పోలీసు స్టేషన్ కి తరలించారు.తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపిన కేసీఆర్ పై కుట్రలను యావత్ రాష్ట్రం జీర్ణించుకోలేక పోతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసిఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేయడం సిగ్గు చేటు అని అన్నారు.

ఓటుకు నోటు కేసులో పట్టపగలు అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విచారణ అనేది పనికిమాలిన చర్య అని, అమలు కానీ హామీలు, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.  కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని రేవంత్ రెడ్డి, మోడీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కేసీఆర్ ని ఇబ్బందులకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని అన్ని గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజకీయ కక్షలతోనే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత

నూతనకల్, సెప్టెంబర్ 3 :రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీని ఎదురుకోలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతూ కాలేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం దుర్మార్గమైన చర్య అని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య అన్నారు.

బుధవారం మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి లక్షల ఎకరాల బీడు భూములకు కాలేశ్వరం ద్వారా నీరు అందిం చి సాగు భూములుగా చేసిన కెసిఆర్ పై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు.  రేవంత్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.  మండల పార్టీ కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్, మాజీ సర్పంచ్ చూడు లింగారెడ్డి, మాజీ ఎంపిటిసి గార్డుల లింగరాజు, బత్తుల విద్యాసాగర్, ఉప్పుల వీరు యాదవ్,బత్తుల విజయ్, మొగుళ్ల వెంకన్న, రేస్ వెంకటేశ్వర్లు,కనకటి మహేష్ తదితరులున్నారు.