calender_icon.png 22 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వ్ ఫారెస్టులో చెట్ల నరికివేత

22-09-2025 01:41:53 AM

  1. గుడిసెలు వేసిన నిందితుల అరెస్టు
  2. ఎఫ్డీఓ రాంమోహన్

జన్నారం(మంచిర్యాల), సెప్టెంబర్ 21 : కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని ఇం దన్ పల్లి రేంజ్, కవ్వాల్ సెక్షన్‌లోని లోతొర్రే బీట్ (కంపార్టుమెంట్ నం. 280)లో అక్రమంగా చెట్లను నరికి, గుడిసెలు వేసుకొని ఉంటున్న నిందితులను పట్టుకుని జడ్జీ ముం దు హాజరుపరిచామని జన్నారం ఎఫ్డీఓ (ఫారెస్టు డివిజన్ ఆఫీసర్) రాంమోహన్ వెల్ల డించారు.

ఆదివారం ఇన్‌చార్జి రేంజ్ ఆఫీస ర్ సుష్మా రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్ల డించారు. అడవులను ఆక్రమించి, చెట్లను నరికి అడవులను నాశనం చేయవద్దని పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా, అటవీ నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించినా వినలేదన్నారు. అరెస్టయిన వారు ‘పోడు రైతులు’ కాదని, అక్రమంగా చెట్లను నరికి అడవి ఆక్రమణలో నిమగ్నమయ్యే వ్యక్తులుగా గుర్తించామన్నారు. 

26 మందికి 14 రోజులు రిమాండ్...

చెట్లను కొట్టి ఆక్రమణలకు పాల్పడిన పార్చకి మారు, కనక బాపురావు, తొడసం హన్మంతరావు, ఆత్రం అక్బర్ షో, ఆత్రం రాజు, విడ్మ జైవంత్ రావు, సిడాం హత్మారావు, కనక మాన్కు, ఆత్రం భీంరావు, సోయం ఛత్రుగాం, ఆత్రం భీంరావు, సిడాం మోతీరాం, ఆత్రం సేతు, పరుబాకి మారుతీ, మడావి భీంరావు, మేస్రం రాజేశ్వర్, కుమ్రం పండు, మడావి సోమోజీ, తొడసం సీతారాం, కనక చంద్రబాను, సోయం రవీందర్,

పెందూర్ జలపతి, మంగం భరత్, సెర్మకి సంతోష్, కనక యశ్వంత్ రావు, పెండూర్ జుగడి రావులను ఈ నెల 20న సాయంత్రం అదుపులోకి తీసుకొని లక్షెట్టిపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ( జేఎఫ్‌సిఎం) ముందు హాజరుపర్చామని ఎఫ్ డీ ఓ రాంమోహన్ తెలిపారు. వీరందరికి 14 రోజులు రిమాండ్ విధించి ఆదిలాబాద్ జైలుకు తరలించారన్నారు. ఆక్రమణలకు పాల్పడితే అటవీ శాఖ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.