22-09-2025 01:40:22 AM
పీఎల్‌ఆర్ బోనస్‌పై జాతీయ కార్మిక సంఘాలతో కోలిండియా సమావేశం
మందమర్రి, సెప్టెంబర్ 21: సింగరేణి సంస్థ 2024 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలలో కార్మికుల వాటా చెల్లింపు కోసం సోమవారం హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిరావుపూలే ప్రజా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కోల్‌బెల్టు ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించ నున్నారు.
సమావేశంలో సింగరేణి సంస్థ 2024 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలపై కార్మికుల వాటా చెల్లింపుపై ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. సింగరేణి యాజమా న్యం ఆహ్వాన పత్రిక విడుదల చేసింది.
ఎదురు చూస్తున్న కార్మికులు...
2023 ఆర్థిక సంవత్సరం బొగ్గు గని కార్మికులకు పిఎల్‌ఆర్ బోనస్ రూ. 93,750 చెల్లించగా, 2022 రూ. 85 వేలు, 2021 రూ. 76,500 చెల్లించారు. గడిచిన మూడు సంవత్సరాలుగా కార్మికులకు పిఎల్‌ఆర్ బోనస్ పెరుగుతూ వస్తుండడంతో ప్రస్తుత సంవత్సరం కూడా కార్మికులకు మరో 15 నుంచి రూ. 20 వేల వరకు బోనస్ పెరుగుతుందని కార్మికులు,
కార్మిక సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు కీలక సమావేశాల్లో బొగ్గుగని కార్మికులతో పాటు సింగరేణి కార్మికులకు పిఎల్‌ఆర్ బోనస్, లాభాల వాటపై ప్రకటన వెలువడ నుండగా లోపల వాటా, పిఎల్‌ఆర్ బోనస్ పెంపుపై కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.