calender_icon.png 11 January, 2026 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మజ్లిస్ కోసమే హైదరాబాద్‌లో సైబరాబాద్ విలీనం

10-01-2026 12:00:00 AM

మైలార్దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి

రాజేంద్రనగర్ జనవరి 9 (విజయక్రాంతి) : సైబరాబాద్‌ను హైదరాబాద్‌లో విలీనం చేయడం రాజేంద్రనగర్ శంషాబాద్ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మైలార్దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.  దారుస్సలామ్‌లో అససుద్దీన్ ఓవైసీతో చర్చించిన తర్వాతే రాజేంద్రనగర్ నియోజకవర్గాని హైదరాబాద్ జోన్ లో కలిపినట్టుగా అనుమానం కలుగుతుందన్నారు.

శుక్రవారం కాటేదాన్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలసి ఆయన మాట్లాడారు. రాజేం ద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రజల సమస్యలు వదిలేసి దుబాయిలో పర్యటన చేస్తు న్నాడని  నియోజకవర్గ పరిస్థితిని కనీ సం కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రాజేంద్రనగర్‌ను సైబరాబాద్ నుంచి హైదరాబాద్‌లో కలపడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనన్నారు. ఇప్పటి కైనా నియోజకవర్గ ప్రజల మేలుకోరి నియోజకవర్గానికి అన్యాయం జరగకుండా కృషి చేయాలని హితువు పలికారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.