calender_icon.png 12 January, 2026 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి పోటీలకు శిక్షకుడిగా వాసం తిరుమల ఎంపిక

11-01-2026 06:33:01 PM

కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వరంగల్ జిల్లా ఖాజీపేటలో నిర్వహించనున్న 58వ జాతీయ స్థాయి సీనియర్ పురుషుల, మహిళల ఖో ఖో పోటీలకు తెలంగాణ మహిళల జట్టు కోచ్‌గా జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల ఖోఖో కోచ్ వాసం తిరుమల్ ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలికల ఖో ఖో జట్టుకు శిక్షణ అందిస్తూ అనేక పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాసం తిరుమల్ తన సారథ్యంలో జిల్లా జట్టును ముందుకు నడిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయనను ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మర్మాట్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, ఏసీఎంఓ ఉద్దవ్, క్రీడల అధికారి మడవి షేకు, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ శివకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు బండ మీనా రెడ్డి, హెచ్‌డబ్ల్యూఓ సాయి బాబా, పాఠశాల ఉపాధ్యాయుడు జంగు, శిక్షకులు అరవింద్, విద్యాసాగర్తో పాటు పాఠశాల అధ్యాపక బృందం మరియు పలువురు అభినందించారు.