11-01-2026 06:26:56 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం, పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై మంటలు చెల్లరేగాయి. డివైడర్ మధ్యలో మంటలు చెలరేగడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, కనగల్ ఎస్ఐ రాజీవ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వెంటనే అప్రమత్తమైన మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సంక్రాంతికి లక్షలాది వాహనాల్లో జనం సొంతూర్లకు వెళ్తున్నారు. వాహనంలో వెళ్తూ సిగరెట్ విసిరేయడంతోనే మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.