calender_icon.png 20 September, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఏ బకాయిలు చెల్లించాలి

20-09-2025 01:09:02 AM

సీపీఎస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ఒకేసారి చెల్లించాలని సీపీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కే.రామకృష్ణారావును శుక్రవారం కలిసి వినతిపత్రం సమ ర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆరు నెలలోసారి ఇచ్చే డీఏను రెండేళ్లకిచ్చి అందు లోనూ వాయిదా పద్ధతిలో చెల్లించడం సరైనదికాదని తెలిపారు. దీనిపై సీఎస్ సాను కూలంగా స్పందిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శితో ఈ విషయంపై చర్చిస్తానని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో రాష్ట్ర నాయకులు నరేష్ గౌడ్, కోటకొండ పవన్ తదితరులు ఉన్నారు.