calender_icon.png 28 November, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే భారీ భూ కుంభకోణం ‘హిల్ట్’

27-11-2025 12:00:00 AM

-9,292 ఎకరాలతో  6.29 లక్షల కోట్ల లూఠీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్

-బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెలంగాణ రాష్ర్ట ప్రభు త్వం తెరలేపిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌తో హిల్ట్‌పై ఆయన వివరించారు. జూబ్లీహి ల్స్ ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఈ  కుంభకోణానికి పథకం వేశారని మండిపడ్డారు. నవంబర్ 22న జీవో నెంబర్ 27 తీసుకొచ్చి 9,292 ఎకరాలకు సంబంధించి 22 ఎస్టేట్స్‌లను మల్టీ జోన్స్ కన్వర్ట్ చేయడానికి ప్లాన్ వేశార న్నారు.

కేవలం ఎస్‌ఆర్‌ఓ వాల్యూలో 30 శాతానికి దారదాత్తం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. దాదాపు ఈ ఆస్తి విలువ 6.29 లక్షల కోట్లకుపైనే ఉంటుందని, దీంతో రాష్ర్ట అప్పును సైతం తీర్చేయొచ్చునని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ వెలుపల గల వేల ఎకరాల భూములకు ప్రభుత్వం లూఠీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి తమ అనుచరులను అక్కడి 22 ఎస్టేట్స్‌కి పంపించి అక్కడి కంపెనీలతో పథకం ప్రకారం ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈ హిల్ట్ పాలసీని, ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే బీజేపీ కచ్చితంగా ఈ కుంభకోణంపై ఉద్యమం చేస్తుందని తెలిపారు.