21 August, 2026 | 6:09 AM

మణికొండలో ‘సిల్క్ అండ్ కాటన్’ చేనేత ఎగ్జిబిషన్

23-05-2024 04:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (విజయక్రాంతి) : దేశవ్యాప్తంగా చేతి వృత్తుల వారు తయారు చేసిన వస్త్రాలు, గృహోపకరణ వస్తువుల ఎగ్జిబిషన్ సేల్ మణికొండ పైపులైన్ రోడ్డులోని సుందర్ గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌కు  ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, భాగల్పూర్, డిజైనర్, కాంతావర్క్, హాండ్లాక్ ప్రింటెడ్ మెటీరియల్, డిజైనర్ బ్లౌజులు, ఖాదీ మెటీరియల్, వన్‌గ్రామ్ గోల్డ్ జ్యూయలరీ, జైపూర్ బెడ్‌షీట్స్, కొండపల్లి బొమ్మలు, పర్సులు, గృహోపకరణ వస్తువుల అమ్మకాలు జరుపుతున్నామని నిర్వాహకులు  తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని వృత్తి కళాకారులు తయారు చేసిన వస్తువులన్నీ ఒకే చోట ఉత్తమమైన నాణ్యతతో లభిస్తుండటంతో కొనుగోలు దారులు ఆదరిస్తున్నారన్నారు. మరికొన్ని రోజులు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని, మణికొండ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు.