calender_icon.png 4 October, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దామోదర్‌రెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరనిలోటు

04-10-2025 01:10:51 AM

-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-ఆర్డీఆర్ మృతికి సంతాపం తెలిపిన సీఎం, మంత్రులు, నేతలు  

-నేడు తుంగతుర్తిలో అంత్యక్రియలు 

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) :  మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు  రామిరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.  పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని తెలిపారు.  దామోదర్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ , మంత్రులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం బంజాహిర్స్‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరాలు, పలువురు  కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.  కాగా, దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు తుంగతుర్తిలో జరగనున్నాయి. పార్టీ తరఫున పీపీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా హాజరుకానున్నారు. దామోదర్‌రెడ్డి తుంగతుర్తి నుంచి నాలుగు సార్లు, సూర్యాపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.