04-10-2025 01:12:00 AM
హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన సంస్థను ప్రారంభించిన బాలీవుడ్ స్టార్ మౌనిరాయ్
హైదరాబాద్, అక్టోబర్ ౩ (విజయక్రాంతి): గాంధీ జయంతిని పురస్కరించు కొని ప్రముఖ కమల్ వాచ్‌కో ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ‘కమల్ లైఫ్ స్టుల్ హౌస్’ను ఘనం గా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్గార్ మౌనిరాయ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘కమల్ లైఫ్ స్టుల్ హౌస్’ ప్రారం భంలో లగ్జరీ రిటైల్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికిందని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. సుమారు 60 సంవత్సరాల క్రితం చైర్మన్ చంద్మల్ తోట్ల స్థాపించిన కమల్ వాచ్ కో విశ్వసనీయమైన సంస్థగా పేరుగాంచిందన్నారు.
కమల్ లైఫ్ స్టైల్ హౌస్ ప్రారంభంతో ఈ వేదిక నగరానికి లగ్జరీ, స్టైల్ బ్రాండ్స్‌కు ప్రముఖ గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ స్టోర్ 50కి పైగా ప్రీమియం, ఫ్యా షన్ వాచ్ బ్రాండ్ల విభిన్నమైన సేకరణతో తన ప్రశస్తిని విస్తరిస్తుంది అని పేర్కొన్నారు. ఈ స్టోర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మాకు ఎంతో సం తోషాన్ని మిగిల్చింది అని వినియోగదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.