22-10-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, అక్టోబర్ 2౧ (విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి కోత ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంట నే పరిష్కరించాలని, అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 9182958858ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
‘తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే’లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉం డాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వేను చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీతో ముగుస్తుందని తెలిపారు. www.telangana.gov.in /telangana rising అనే వెబ్ సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను పొందుపరచాలని కలెక్టర్ సూచించారు.