17-05-2025 08:28:05 PM
వైరా (విజయక్రాంతి): వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్(MLA Maloth Ramdas Nayak) ని శనివారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్, సామాజిక ఉద్యమ నేత గౌరవరపు డేవిడ్ రాజులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కొరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... మూడు దశాబ్దాల మాదిగ దండోరా ఉద్యమ ఫలితంగా ఏబిసి వర్గీకరణ సాధించామని తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాదిగ జాతి ఉపకులాల జాతులు తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి అండగా ఉన్నారని, మాదిగల అంటే కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీకి అమితమైన అభిమానమన్నారు. ఏ బి సి వర్గీకరణ అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జూన్ మొదటి వారంలో జరిగే మాదిగ ఉపకులాల విజయోత్సవ సభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు శ్రీను మాదిగ పాల్గొన్నారు.