17-05-2025 08:33:25 PM
మునగాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారుల ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని, అధికారులు సర్వే చేసిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేసామని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి తెలిపారు. గత గురువారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారుల ఎంపిక సర్వేలో తప్పులతడకగా జరిగాయని ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు తన సొంత మనుషులకే ఇందిరమ్మ ఇల్లులను ఎంపిక చేశాడని ఆరోపణను తీవ్రంగా ఖండించిన గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈధరావు, నిజమైన అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రక్రియ జరిగినట్లు నిరూపిస్తే ఇందిరమ్మ కమిటీకి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు ప్రజలలో మంచి స్పందన వస్తుందని దానిని తట్టుకోలేకనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని ,కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టిన బీసీ బందు, దళిత బంధు లాంటి పథకాలను ఎవరికి మంజూరు చేశారో తెలపాలని ఆయన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లుల ఎంపిక ప్రక్రియ పార్టీలకతీతంగా జరుగుతుందని మునగాల మండల కేంద్రంలోని దళితవాడకు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా నలుగురికి ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేశామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం 56 ఇల్లులు మంజూరు కాగా లబ్ధిదారులను ఎంపిక చేసామని, ఇంకా 60 ఇల్లులు కావాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి నీ అడగగా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ,కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డిలు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందంజలో ఉన్నారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ పోలిశెట్టి బుచ్చి పాపయ్య మాట్లాడుతూ 5 ఎకరాల లోపు భూమి ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు ,మాజీ వైస్ ఎంపీపీ కోలిశెట్టి బుచ్చి పాపయ్య, ఐ ఎన్ టి సి జిల్లా అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేనపల్లి వీరబాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈదారావు, చింతకాయల నాగరాజు,శెట్టి గిరి ,కొండా రామాంజి, మైసయ్య, లంజపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.