calender_icon.png 29 August, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల మీద ప్రమాదంగా ఉన్న కరెంటు తీగలను తొలగించాలి: సిపిఎం

29-08-2025 06:11:09 PM

నకిరేకల్,(విజయక్రాంతి): ఇండ్ల మీద ప్రమాదంగా ఉన్న 11 కెవి కరెంటు తీగలను తొలగించి  సీసీ రోడ్లు కాలువలను వెంటనే ఏర్పాటు చేయాలి. పట్టణంలోని 15,16 వార్డులోని గణేష్ నగర్ లో ప్రమాదంగా ఇండ్ల మీద ఉన్న 11 కెవి కరెంటు తీగలను తొలగించి  ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు అధికారులను కోరారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 15,16 వార్డులలో సిపిఎం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రజల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీసీ రోడ్లు కాలువలను  ఏర్పాటు చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.