29-08-2025 06:06:28 PM
రేగొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే భూపాలపల్లి నుండి వయా మోరాంచపల్లి,ఎస్ ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్ల పల్లి, కొడవంటచ వరకు బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి మోరాంచ గ్రామం నుండి కోటాంచ వరకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
అనంతరం రేగొండ మండలంలోని రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయితీ భవనం, కోటంచ లక్ష్మి నరింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు, రంగయ్య పల్లి గ్రామంలో మాండలయ్య గుడికి రూ.5 లక్షలు, అలాగే రేణుక ఎల్లమ్మ గుడి ప్రహారి గోడకు రూ.15 లక్ష లతో శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని,కోటంచ దేవాలయాన్ని మరో యాదగిరి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.ప్రజల అభివృద్ధే ప్రభుత్వ అభివృద్ధేనని అన్నారు.