27-07-2025 10:50:11 PM
దూలం శ్రీనివాస్..
రామకృష్ణాపూర్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి వదిలి కనీస వేతనాలు అందిస్తూ, పని గంటల పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలని ఎస్సీ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్(SC KS State President Dhulam Srinivas) డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన రిజియన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవరిహాస్తున్నాయని అన్నారు. ఎస్సీ కేఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సంకె రవి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా వేతనాలు పెంచక పోగా అదనంగా 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేయడంపై మండిపడ్డారు.
వెంటనే జీవో నెం. 282ను రద్దు చేయాలని, లేని పక్షంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అదే విదంగా రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఆగష్టు 1 నుంచి 20 వరకు కార్మిక సమస్యలపై క్యాంపేయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కేఎస్ శ్రీరాంపూర్ బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు వెల్పుల కుమారి, గట్టు మహేందర్, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి గందం రవి, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి రాజశేఖర్, నాయకులు పెద్ద లచ్చన్న, కుమార్, కేశవ్, శారధ, సంతోషిని, కళావతి, రాజేందర్, శ్రీధర్, రాజయ్య, వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.