calender_icon.png 28 July, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరాలో యువకుడు గల్లంతు

27-07-2025 11:00:24 PM

పాపన్నపేట: మంజీరాలో యువకుడు గల్లంతయిన ఘటన పాపన్నపేట మండల(Papannapet Mandal) పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన షహబాజ్(25) ఆదివారం తన మిత్రులతో కలిసి రామతీర్థం శివారులోని మంజీరా బ్రిడ్జి వద్ద స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీటి వరదలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు కుటుంబీకులకు, ఆ తర్వాత పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించగా ఘటనస్థలానికి చేరుకున్న పాపన్నపేట పోలీసులు, గజ ఈతగాళ్ళ సహాయంతో మృతదేహాన్ని గాలించగా ఆచూకి లభించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా ఆపివేసిన గజ ఈతగాళ్లు సోమవారం ఉదయం తిరిగి గాలించనునున్నారు.