calender_icon.png 28 July, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగ దేవమ్మ గుడి ప్రహరీకి 50 వేల విరాళం అందజేసిన ఏమిరెడ్డి నర్సిరెడ్డి

27-07-2025 10:54:16 PM

శాలిగౌరారం (విజయక్రాంతి): మండల పరిధిలోని భైరవుని బండ గ్రామానికి చెందిన యాదవుల ఆరాధ్య దైవమైన గంగ దేవమ్మ గుడి ప్రహరీ గోడ నిర్మాణానికి శాలి గౌరారం వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ ఏమిరెడ్డి నర్సిరెడ్డి-మంగ దంపతులు 50116/- రూపాయల విరాళంతో పాటు చీర సారె కూడా అందించారు. ఆదివారం నల్లగొండలోని ఆయన నివాసంలో భైరవుని బండ గ్రామానికి చెందిన యాదవులు నర్సిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. గంగా భవాని అమ్మవారి దయతో ప్రజలు సుఖసంతోషాలతో సుబిక్షంగా ఉండాలని, గంగా భవాని గుడికి మా వంతుగా సహకారం ఉంటుందని ఈ విషయం పట్ల మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్బంగా యాదవ సంఘం నాయకులు నర్సిరెడ్డి-మంగ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు సంకటి రమేష్,పెద్ద గొల్ల బీసం నర్సింహ,సారీ గొల్ల కడారి మల్లయ్య,సంకటి శంకర్,మెరుగు ముత్తయ్య,పులిచెర్ల రవి తదితరులు పాల్గొన్నారు.