27-07-2025 10:41:16 PM
ఎంపీ రఘునందన్ రావు..
సిద్దిపేట క్రైమ్: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రజల్లో వచ్చిన చైతన్యం పట్ల ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) వర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ కట్టపై సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన థర్డ్ ఎడిషన్ హాఫ్ మారథాన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే మనదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారనే స్థితి నుంచి భవిష్యత్తులో ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, యువత బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ మారథాన్ లో రాష్ట్రం నలుమూలల నుంచి యువతి యువకులు పాల్గొన్నారు. అనంతరం 5కె, 10కె, 21కె పోటీల్లో గెలుపొందిన వారికి సంపూర్ణేష్ బాబుతో కలిసి ఎంపీ రఘునందన్ రావు మెడల్స్ అందజేశారు. థర్డ్ ఎడిషన్ హాఫ్ మారథాన్ నిర్వాహకులను వారు అభినందించారు.