calender_icon.png 16 November, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్.. ఈ జాబితాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎక్కడున్నారంటే?

22-07-2024 11:10:52 AM

డార్లింగ్ ప్రభాస్ పేరు వింటేనే అతని ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ప్రస్తుతం కల్కీ సినిమా భారీ విజయంతో ఎంజాయ్ చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని అభిమానులకు మరో గుడ్ న్యూస్. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో అగ్రస్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆర్మాక్స్ జూన్ నెలకు సంబంధించిన దేశంలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టును విడుదల చేసింది. మేలో టాప్ లో ఉన్న డార్లింగ్ ప్రభాస్ జూన్ లోనూ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి 3 స్థానంలో ఉన్నారు. ఇక అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మహేశ్ బాబు 6వస్థానంలో ఉండగా, ఇదే జాబితాలో రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ 7,8,10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. అటు మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో ఆలియా భట్ తొలి స్థానంలో ఉండగా, సమంత, దీపిక పదుకొనే తర్వాత స్థానంలో ఉన్నారు.