calender_icon.png 16 September, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్శక ధీరుడిపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ రిలీజ్

22-07-2024 10:48:10 AM

హైదరాబాద్: ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళిపై ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్‌తో భాగస్వామ్యంతో డాక్యుమెంటరీ రూపొందిం చింది. మోడరన్ మాస్టర్స్ పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. అందులో సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను తెలియజేడం చూపించారు. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంట్ చిత్రం ఆగస్టు 2న ప్రసారం కానుంది. ఈగ నుండి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి తీసిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడమే కాకుండా అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. భారతీయ సినిమాలో కొత్త రికార్డులను సృష్టించాయి. ప్రఖ్యాత సినీ విమర్శకురాలు, పాత్రికేయురాలు సైతం రాజమౌళి ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి తీసిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.